Nothing Phone 3A: వన్‌ప్లస్ కి ధీటుగా నథింగ్ ఫోన్ 3A.. మరిన్ని ఫీచర్లు కేవలం రూ.25 వేలకే.! 28 d ago

featured-image

NOTHING PHONE 3A: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. నథింగ్ కంపెనీ అదిరిపోయే ఫీచర్లుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. నథింగ్ ఫోన్ (3a) మరియు ఫోన్ (3a) ప్రో అనే రెండు ఫోన్లు ఈ సిరీస్‌లో ఉన్నాయి. నథింగ్ కంపెనీ ఫోన్‌లు మిగతా కంపెనీ ఫోన్‌లు కన్నా భిన్నంగా ఉంటాయి. ఈ ఫోన్‌లు వెనుక లైట్లు మెరుస్తూ ప్రత్యేకమైన డిజైన్ తో వస్తున్నాయి. ఈ డిజైన్ ను "గ్లిఫ్ ఇంటర్‌ఫేస్" అంటారు. నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు.. ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఈ లైట్లు ప్రత్యేకంగా వెలుగుతాయి. మరెందుకు ఆలస్యం..ఈ నథింగ్ ఫోన్ 3a వివరాలు చూద్దాం రండి.


నథింగ్ ఫోన్ 3a ఫీచర్లు:

  • డిస్‌ప్లే: 6.72 అంగుళాల AMOLED
  • రిఫ్రెష్ రేటు: 120Hz
  • ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3
  • బ్యాటరీ: 5000mAh
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 5G- సింగిల్‌ సిమ్ స్లొట్టెడ్ ఫోన్


కెమెరా ఫీచర్లు: ఇది త్రిపుల్‌ సిరీస్ బ్యాక్ కెమెరాలతో వస్తుంది.

బ్యాక్ కెమెరా: 50MP మెయిన్ కెమెరా

            8MP అల్ట్రా-వైడ్ కెమెరా

             50MP టెలిఫోటో కెమెరా (2x ఆప్టికల్ జూమ్)

ఫ్రంట్ కెమెరా: 32MP


కనెక్టివిటీ ఫీచర్లు:

  • బ్లూటూత్ 5.0
  • USB టైప్-C పోర్ట్


వేరియంట్స్:

  • 8GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 256GB స్టోరేజ్


సాఫ్ట్‌వేర్ వెర్షన్: ఈ నథింగ్ ఫోన్ 3a ఆండ్రాయిడ్ 15.. నథింగ్ OS వెర్షన్ 3.0 తో వస్తుంది.


ఫోన్ రంగులు:

  • తెలుపు
  • నలుపు
  • బ్లూ 

ఫోన్ ధర:

నథింగ్ ఫోన్ 3A:

  • 8GB RAM, 128GB స్టోరేజ్ -- రూ.24,999
  • 8GB RAM, 256GB స్టోరేజ్ -- రూ.26,999

నథింగ్ ఫోన్ 3A pro:

  • 8GB RAM, 128GB స్టోరేజ్ -- రూ.29,999
  • 8GB RAM, 256GB స్టోరేజ్ -- రూ.31,999


లోపాలు: ఈ నథింగ్ కంపెనీ ప్రారంభించి కొద్ది సంవత్సరాలే కావడం వల్ల‌ ఈ కంపెనీ ఫోన్లకు సంబంధించిన సర్వీస్ సెంటర్ లు ఎక్కువగా లేవు. ఈ ఫోన్లకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ చాల అరుదుగా లభిస్తాయి. నథింగ్ ఫోన్ 3a రంగులు కూడా పెద్ద ఆకర్షణీయంగా లేవు.


ప్రస్తుతం ఈ నథింగ్ ఫోన్ 3a మార్చ్ 4న విడుదల కావాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల‌ ఇది ఆలస్యం అయ్యి మార్చ్ 11న విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది...అదికూడా 3A మోడల్ ఒకటే ఉంది. 3A pro మోడల్ స్టాక్ కోసం వేచి ఉండాల్సిందే. ఈ ఫోన్‌ని One Plus Nord కి పోటీగా తీసుకొచ్చారు. One Plus ఫోన్ ఫీచర్లు తక్కువ ధరకే కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఈ నథింగ్ ఫోన్ 3a సిరీస్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, వేగవంతమైన పనితీరు, మంచి కెమెరాలతో.. ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.


ఇది చదవండి: ఐఫోన్ 17 సిరీస్ లీక్స్.. ఊహించని సరికొత్త ఫీచర్లు!

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD